Rahul Gandhi: వారి బతుకులు దుర్భరంగా మారిపోయాయి: రాహుల్ గాంధీ

  • ఢిల్లీ, నోయిడాల్లోని కార్మికుల పరిస్థితిపై రాహుల్ ట్వీట్
  • ఈ పరిస్థితికి ప్రభుత్వమే కారణమని ఆరోపణ
  • ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్
Rahul Gandhi fires on Modi govt

ప్రభుత్వం అమలు చేస్తున్న లాక్‌డౌన్ కారణంగా దినసరి, వలస కూలీల బతుకులు దుర్భరంగా మారిపోయాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ భయానక పరిస్థితికి ప్రభుత్వమే కారణమని నిందించారు. ఢిల్లీ, నోయిడాల్లోని వలస కూలీలు పనుల్లేక ఇంటికి వెళ్లేందుకు రోడ్లపై గుమిగూడిన ఫొటోలు, వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసిన రాహుల్.. ఇలాంటి ఎందరో ఉపాధి కోల్పోయారని, ఇప్పుడు వారందరి ఏకైక లక్ష్యం ఇల్లు చేరడమేనని అన్నారు.

అయితే, అందుకు వారు చాలా కష్టపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మన భారతీయులతో మనం ఇలా వ్యవహరించడం పట్ల తాను సిగ్గుపడుతున్నట్టు పేర్కొన్నారు. నిజానికి దీనిపై ప్రభుత్వం వద్ద ఎలాంటి ప్రణాళికలు లేవని రాహుల్ వరుస ట్వీట్లలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి సంక్షోభ సమయంలో వారందరికీ కనీస గౌరవాన్ని ఇవ్వాల్సి ఉందని, ఈ విషయమై ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని కోరారు.

More Telugu News