Akshay kumar: భారీ విరాళం ప్రకటనకు ముందు.. అక్షయ్‌తో జరిగిన సంభాషణను బయటపెట్టిన ట్వింకిల్ ఖన్నా!

The man makes me proud twinkle says about Akshay Kumar
  • పీఎం కేర్స్ ఫండ్‌కు రూ. 25 కోట్ల విరాళం
  • అంత మొత్తం ప్రకటిస్తే ఎలా అని ప్రశ్నించిన ట్వింకిల్
  • కెరియర్ ప్రారంభంలో తన వద్ద చిల్లిగవ్వ లేదని అక్షయ్ సమాధానం
కరోనాపై పోరాడుతున్న ప్రభుత్వానికి అండగా నిలిచిన బాలీవుడ్ ప్రముఖ నటుడు అక్షయ్ కుమార్ నిన్న రూ. 25 కోట్ల భారీ విరాళం ప్రకటించాడు. బాలీవుడ్‌లో ఇంతమొత్తంలో విరాళం ప్రకటించిన తొలి నటుడు అక్షయ్ కుమారే. ఆపన్నులను ఆదుకోవడంలో ముందుండే అక్షయ్‌కుమార్‌పై సర్వత్ర ప్రశంసల వర్షం కురుస్తోంది. తన భర్త భారీ మొత్తంలో విరాళం ప్రకటించడంపై అక్షయ్ భార్య ట్వింకిల్ ఖన్నా సంతోషం వ్యక్తం చేస్తూనే.. అంతకుముందు అక్షయ్‌తో జరిగిన సంభాషణను ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.

పీఎం కేర్స్ ఫండ్‌కు రూ. 25 కోట్లు ప్రకటించిన అక్షయ్ తనను గర్వపడేలా చేశాడని పేర్కొన్న ట్వింకిల్.. మరీ అంతమొత్తంలో ప్రకటిస్తే ఎలా అని, మనకి కూడా డబ్బులు అవసరం కదా అని ప్రశ్నించానని తెలిపింది. దీనికి అక్షయ్ బదులిస్తూ.. తాను కెరియర్ ప్రారంభించినప్పుడు తన వద్ద చిల్లిగవ్వ కూడా లేదని, కానీ ఇప్పుడీ స్థాయిలో ఉన్నానని గుర్తు చేశాడని వివరించింది. ఇలాంటి పరిస్థితుల్లో సాయం చేయకుండా ఉండలేనని అన్నాడని ట్వింకిల్ తెలిపింది.
Akshay kumar
Bollywood
Corona Virus
Twinkle Khanna

More Telugu News