'ఆర్ఆర్ఆర్'లో భాగమైన తమిళ సూపర్ స్టార్ విజయ్... పాత్ర గురించి రాజమౌళి చెబితే అంగీకరించారట!

29-03-2020 Sun 06:25
  • 'ఆర్ఆర్ఆర్'లో కీలక పాత్రకు విజయ్
  • ప్రస్తుతానికి కరోనా భయంతో నిలిచిన షూటింగ్
  • తదుపరి షెడ్యూల్ లో జాయిన్ కానున్న తలైవా
Thalaiva Vijay in RRR

రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్ హీరోలుగా, అజ‌య్ దేవ‌గ‌ణ్‌, ఆలియా భ‌ట్‌, ఒలివియా మోరిస్‌, అలిస‌న్ డూడి, రే స్టీవెన్ స‌న్, స‌ముద్ర ఖ‌ని తదితర భారీ తారాగణంతో రూపుదిద్దుకుంటున్న 'రౌద్రం రణం రుధిరం' (ఆర్ఆర్ఆర్‌)లో తమిళ సూపర్ స్టార్ విజయ్ కూడా భాగమయ్యారని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.

విజయ్‌ కి ఫోన్ చేసిన రాజమౌళి, తన చిత్రంలోని ఓ కీలకమైన పాత్ర గురించి చెప్పి, ఆ పాత్రను చేయాలని కోరగా, విజయ్‌ వెంటనే ఒప్పుకున్నారని సమాచారం. ఇక ప్రస్తుతానికి కరోనా భయాలతో చిత్ర షూటింగ్ నిలిచిపోగా, సాధారణ పరిస్థితులు నెలకొనగానే, షూటింగ్‌ ను తిరిగి ప్రారంభించాలని రాజమౌళి భావిస్తున్నారు. తదుపరి షెడ్యూల్ లోనే విజయ్ పాల్గొంటారని సినీ వర్గాలు అంటున్నాయి. ఇక ఈ వార్తలపై రాజమౌళి నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సివుంది.