India: ఇండియాలో 1000 దాటిన కరోనా పాజిటివ్ కేసులు!

Above 1000 Corona Positive in India
  • నిన్న సాయంత్రానికి 870కా పైగా కేసులు
  • దేశవ్యాప్తంగా ప్రస్తుతం 920 యాక్టివ్ కేసులు
  • రికవరీ అయింది 85 మంది మాత్రమే
ఇండియాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య వెయ్యి దాటింది. నిన్న సాయంత్రానికి 870కి పైగా కేసులు నమోదుకాగా, ఈ ఉదయానికి పాజిటివ్ గా తేలిన వారి సంఖ్య 1,029కి పెరిగింది. అధికారిక గణాంకాల ప్రకారం, 920 యాక్టివ్ కేసులు దేశంలోని వివిధ ప్రాంతాల్లో చికిత్స పొందుతుండగా, 85 మంది రికవరీ అయ్యారు. 24 మంది మరణించారు. ఇక మహారాష్ట్రలో అత్యధికంగా 186 కేసులు నమోదు కాగా, ఆరుగురు మరణించారు. ఆపై రెండో స్థానంలో నిలిచిన కేరళలో 182 మందికి వ్యాధి సోకగా, ఒకరు మరణించారు. కర్ణాటకలో 81, తెలంగాణలో 67, ఉత్తర ప్రదేశ్ లో 65, గుజరాత్ లో 55, రాజస్థాన్ లో 54, ఢిల్లీలో 49, తమిళనాడులో 42, మధ్యప్రదేశ్ లో 39, పంజాబ్ లో 38, హర్యానాలో 35, జమ్ము కశ్మీర్ లో 33 కేసులు నమోదయ్యాయి.

ఆపై ఆంధ్రప్రదేశ్ లో 19, పశ్చిమ బెంగాల్ లో 18, లడ్డాక్ లో 13, బీహార్ లో 11, అండమాన్ దీవుల్లో 9, చండీగఢ్ లో 8, చత్తీస్ గఢ్ లో 7, ఉత్తరాఖండ్ లో 6, గోవా, హిమాచల్ ప్రదేశ్, ఒడిశాల్లో 3, మణిపూర్, మిజోరం, పుదుచ్చేరిల్లో ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయి. రికవరీల విషయంలో మహారాష్ట్ర, యూపీ, హర్యానాలు ముందున్నాయి. మహారాష్ట్రలో 25 మంది వ్యాధిగ్రస్తులు రికవరీకాగా, యూపీ, హర్యానాల్లో 11 మంది చొప్పున వ్యాధి నుంచి బయటపడ్డారు.
India
Corona Virus
Positive

More Telugu News