Tamilisai Soundararajan: ఒక నెల జీతాన్ని సీఎం రిలీఫ్ ఫండ్ కు విరాళంగా ఇస్తున్నాను: తమిళిసై

Telangana governor Tamilisai donates her one month emoluments
  • తెలంగాణలో కరోనా లాక్ డౌన్
  • కరోనాపై పోరుకు మద్దతిస్తున్నట్టు తమిళిసై వెల్లడి
  • రాష్ట్ర ప్రథమ పౌరురాలిగా ప్రజలకు సంఘీభావం
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తన ఒక నెల జీతాన్ని కరోనాపై పోరుకు విరాళంగా ఇస్తున్నట్టు ప్రకటించారు. "కరోనా మహమ్మారిపై పోరులో తెలంగాణ రాష్ట్ర ప్రథమ పౌరురాలిగా రాష్ట్ర ప్రజలందరికి మద్దతుగా నిలుస్తున్నాను. నా వంతు భాగస్వామ్యంగా ఒక నెల వేతనాన్ని సీఎం రిలీఫ్ ఫండ్ కు చెక్ రూపంలో అందించనున్నాను" అంటూ తమిళిసై ట్వీట్ చేశారు. కాగా, కరోనా ప్రభావంతో తెలంగాణలో లాక్ డౌన్ ను మరింత కఠినంగా అమలు చేస్తున్నారు. పాజిటివ్ కేసులు పెరుగుతుండడం ప్రభుత్వాన్ని ఆందోళనకు గురిచేస్తోంది.
Tamilisai Soundararajan
Telangana
Governor
Corona Virus
COVID-19
Lockdown

More Telugu News