Chiranjeevi: నాన్న... నా పక్కన మీ మిత్రుడు ఉన్నారు: మంచు లక్ష్మి

- కరోనాపై మంచు లక్ష్మి వీడియో
- ట్విట్టర్ లో షేర్ చేసిన చిరంజీవి
- సంతోషాన్ని వ్యక్తం చేసిన లక్ష్మి
ఉగాది సందర్భంగా సోషల్ మీడియాలో అడుగుపెట్టిన చిరంజీవి ఆసక్తికర ట్వీట్లతో సందడి చేస్తున్నారు. సినీ పరిశ్రమలోని పలువురు ప్రముఖులు చేస్తున్న ట్వీట్లకు సరదాగా సమాధానాలిస్తూ అభిమానులకు వినోదాన్ని పంచుతున్నారు. ముఖ్యంగా మోహన్ బాబుతో జరిగిన సంభాషణ అభిమానులను బాగా ఆకట్టుకుంది.
మరోవైపు కరోనా వైరస్ పై ప్రజల్లో చైతన్యం కలిగించేలా మంచు లక్ష్మి చేసిన ఓ వీడియోను చిరంజీవి షేర్ చేశారు. దీనిపై లక్ష్మి స్పందిస్తూ సంతోషాన్ని వ్యక్తం చేసింది. అంతేకాదు తన తండ్రిని ఉద్దేశించి ట్వీట్ చేస్తూ, 'వైరస్ గురించిన తన వీడియోను మెగాస్టార్ ఎండార్స్ చేయడం వల్ల అది ఎక్కువ మందికి చేరుతుంది. నాన్న... నా పక్కన మీ మిత్రుడు ఉన్నారు. మా బంధం నీరు, చేప వంటిది' అని వ్యాఖ్యానించింది.