Bandla Ganesh: సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ ఆసక్తికర పోస్ట్

cine artist Bandla Ganesh thanks to cm kcr
  • ‘కరోనా’ నేపథ్యంలో చికెన్ తినొద్దన్న దుష్ప్రచారం
  • దీనిని సీఎం కేసీఆర్ ఖండించడంపై గణేశ్ హర్షం
  • ‘థ్యాంక్యూ సార్’ అంటూ కేసీఆర్ వీడియో పోస్ట్ చేసిన వైనం
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో చికెన్ తినొద్దన్న దుష్ప్రచారంతో వాటి అమ్మకాలు భారీగా తగ్గిపోయిన విషయం తెలిసిందే. ఈ దుష్ప్రచారాన్ని సీఎం కేసీఆర్ స్వయంగా ప్రెస్ మీట్ లో ఖండించడమూ విదితమే. ఈ నేపథ్యంలో పరమేశ్వర పౌల్ట్రీ ఫార్మ్స్ అధినేత, ప్రముఖ నటుడు, సినీ నిర్మాత బండ్ల గణేశ్ ఓ ఆసక్తికర పోస్ట్ చేశారు.

‘మాటల్లేవ్.. మాట్లాడుకోవడాల్లేవ్ మీ సహాయానికి  పరమేశ్వర పౌల్ట్రీ ఫార్మ్స్’ బండ్ల గణేశ్ నమస్కారం అంటూ తెలంగాణ సీఎంఓ ను ట్యాగ్ చేస్తూ ఓ పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ తో పాటు సీఎం కేసీఆర్ ఫొటోను జతపరిచారు. ‘థ్యాంక్యూ సార్’ నమస్కారం అంటూ మరో పోస్ట్  చేసిన బండ్ల గణేశ్, ప్రెస్ మీట్ లో కేసీఆర్ మాట్లాడిన ఓ వీడియోను జతపరిచారు. కాగా, బండ్ల గణేశ్ తొలుత చేసిన పోస్ట్ పై నెటిజన్లు భిన్న వ్యాఖ్యలు చేశారు. ‘ఏమైంది అన్నా’ అంటూ ఒకరు, ‘నువ్వు కూడా సహాయం చెయ్ బాసు’ అంటూ మరొకరు వ్యాఖ్యలు చేశారు.
Bandla Ganesh
Tollywood
kcr
TRS
Corona Virus
chicken

More Telugu News