కృష్ణవంశీతో నాకు ఎలాంటి గొడవలు లేవు: నటుడు ఉత్తేజ్

27-03-2020 Fri 16:23
  • రైటర్ గా వర్మ దగ్గర పనిచేశాను 
  • కృష్ణవంశీతో మంచి స్నేహం వుంది
  • అవకాశాలతో సంబంధం లేని అనుబంధం ఉందన్న ఉత్తేజ్  
Uttej
నటుడిగా .. రచయితగా ఉత్తేజ్ కి ఎంతో అనుభవం వుంది. ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, "నేను రామ్ గోపాల్ వర్మ దగ్గర రైటింగ్ డిపార్ట్ మెంట్లో పనిచేస్తూ ఆయన సినిమాల్లో నటించాను. ఆ తరువాత కృష్ణవంశీ దగ్గర రైటర్ గా కొన్ని సినిమాలకు పనిచేస్తూ ఆ సినిమాల్లో నటించాను. కృష్ణవంశీకి .. నాకు మధ్య అభిప్రాయభేదాలు వున్నాయనే టాక్ నా వరకూ వచ్చింది.

నిజానికి మా మధ్య ఎలాంటి మనస్పర్థలు లేవు. తన పేరులో సగం ఉత్తేజ్ అని ఒక ఇంటర్వ్యూలో కృష్ణవంశీ చెప్పడం నేను చూశాను. ఆయనతో కలిసి కనిపిస్తే స్నేహంగా ఉన్నట్టు .. లేదంటే విడిపోయినట్టు కాదు. కృష్ణవంశీ నాకు అవకాశాలు ఇవ్వడం లేదు అంటే, ప్రస్తుతం ఆయనకే సినిమాలు లేవు. అలా అని సినిమాల్లో అవకాశం ఇస్తేనే ఆయనతో స్నేహంగా వుంటాను .. లేకపోతే లేదు అనుకునే టైపు కూడా నేను కాదు. ఇప్పటికీ ఆయన నాకు మెసేజ్ లు పెడుతూనే ఉంటాడు" అని చెప్పుకొచ్చాడు.