'ఉప్పెన' నిర్మాణ ఖర్చు 22 కోట్లు!

27-03-2020 Fri 11:58
  • ప్రేమకథా చిత్రంగా 'ఉప్పెన'
  • దర్శకుడిగా బుచ్చిబాబు పరిచయం 
  •  స్వయంగా రిలీజ్ చేసే ఆలోచనలో మైత్రీ
Uppena Movie
సుకుమార్ దగ్గర శిష్యరికం చేసిన బుచ్చిబాబు దర్శకుడిగా పరిచయమవుతూ, ఒక ప్రేమకథా చిత్రాన్ని రూపొందించాడు. 'ఉప్పెన' పేరుతో నిర్మితమైన ఈ సినిమా ద్వారా కథానాయకుడిగా వైష్ణవ్ తేజ్ .. నాయికగా కృతి శెట్టి పరిచయమవుతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ వారు ఈ సినిమా కోసం 22 కోట్ల రూపాయలను ఖర్చు చేశారట. హీరో .. హీరోయిన్ .. దర్శకుడు అంతా కొత్తవాళ్లే కావడంతో, నిర్మాతలు చెప్పిన రేటుకి ఈ సినిమాను కొనడానికి ఎవరూ ముందుకు రావడం లేదనే టాక్ వినిపిస్తోంది.

డిజిటల్ రైట్స్ కూడా ఆశించిన స్థాయిలో పలకడం లేదట. అయితే ఈ సినిమాపై మైత్రీ మూవీ మేకర్స్ వారు పూర్తి నమ్మకంతో ఉన్నారట. అందువలన తామే స్వయంగా రిలీజ్ చేయాలనే నిర్ణయానికి వచ్చారని అంటున్నారు. సినిమా విడుదల తరువాతనే డిజిటల్ రైట్స్ అమ్మాలనే అభిప్రాయానికి వచ్చారట. వాళ్ల నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకూ నిలబెడుతుందో చూడాలి మరి.