Chiranjeevi: రామ్‌ చరణ్‌ను నిరాశపర్చడంపై చిరంజీవి, రాజమౌళి మధ్య ఆసక్తికర సంభాషణ

chiranjeevi about ram charan ntr gift
  • చెర్రీకి ఎన్టీఆర్‌ ఇస్తానన్న గిఫ్ట్‌ను ఆలస్యం చేస్తోన్న జక్కన్న
  • స్పందించి కొంచమే ఆలస్యమవుతుందన్న రాజమౌళి
  • అర్థమైంది అంటూ చిరు ట్వీట్
సినీనటుడు రామ్ చరణ్‌ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు డిజిటల్‌ వేదికగా మర్చిపోలేని గిఫ్ట్‌ ఇస్తానని జూనియర్‌ ఎన్టీఆర్‌ నిన్న ప్రకటించగా, ఆ గిప్ట్‌ను త్వరగా విడుదల చేయకుండా దర్శకుడు రాజమౌళి ఆలస్యం చేస్తోన్న విషయం తెలిసిందే. దీనిపై మెగాస్టార్‌ చిరంజీవి స్పందిస్తూ 'ఎదురు చూస్తున్నాను' అంటూ ఓ ఫొటోను పోస్ట్ చేశారు. ఆయన కూడా నిరాశ వ్యక్తం చేశారు.

దీనిపై రాజమౌళి స్పందిస్తూ... 'సా..ర్.. అంటే.. అది.. కొంచం.. కొంచమే.. ప్లీజ్‌.. సర్‌' అని ట్వీట్ చేశారు. కొంచం ఆలస్యం అవుతుందని చెప్పారు. దీనిపై చిరు స్పందిస్తూ.. 'అర్థమైంది.. జక్కన్న గారూ' అని చెప్పారు. కాగా, ఆ గిఫ్ట్‌ను ఈ రోజు సాయంత్రం 4 గంటలకు విడుదల చేసే అవకాశముంది.
Chiranjeevi
Ramcharan
Rajamouli

More Telugu News