Guntur: గుంటూరులో కలకలం...ఆసుపత్రి నుంచి పారిపోయిన కరోనా బాధితుడు

corono expected patient runaway from guntur hospital
  • నగరంలోని సర్వజనాసుపత్రిలో ఘటన 
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన జీజీహెచ్ ఆర్ఎంవో 
  • కేసు నమోదుచేసి గాలిస్తున్న పోలీసులు

గుంటూరులోని సర్వజనాసుపత్రిలో చికిత్స పొందుతున్న కరోనా అనుమానితుడు అదృశ్యం కావడం స్థానికంగా కలకలం రేపింది. పోలీసుల కథనం మేరకు...కృష్ణా జిల్లా పెనమలూరుకు చెందిన ఓ వ్యక్తికి కరోనా లక్షణాలు ఉండడంతో కుటుంబసభ్యులు ఈనెల 25న గుంటూరులోని సర్వజనాసుపత్రిలో చేర్పించారు. జీజీహెచ్ వైద్యులు అతన్ని ఐసోలేషన్ వార్డులో ఉంచి పరీక్షిస్తున్నారు. కాగా, నిన్న వైద్య సిబ్బంది, ఇతర ఉద్యోగుల కళ్లుగప్పి సదరు వ్యక్తి ఎటో వెళ్లిపోయాడు. దీంతో ఆసుపత్రి వర్గాలు కంగుతిన్నాయి. వెంటనే జీజీహెచ్ ఆర్ఎంవో ఆదినారాయణ పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం బాధితుడి కోసం గాలిస్తున్నారు.

Guntur
sarwajana hospital
patient missing
police case

More Telugu News