నాడు దేశాన్ని ఉర్రూతలూగించిన 'రామాయణ్'.. రేపటి నుంచి దూరదర్శన్ లో మళ్లీ ప్రేక్షకుల ముందుకు!
- 1987లో దూరదర్శన్ లో ప్రసారం
- ఉదయం 9 నుంచి 10 గంటల వరకు తొలి ఎపిసోడ్
- తిరిగి రాత్రి 9 నుంచి 10 గంటల వరకు
రేపు (శనివారం) రామాయణ్ తొలి ఎపిసోడ్ దూరదర్శన్ లో ప్రసారం కాబోతుంది. ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు... తిరిగి రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు సీరియల్ ప్రసారం అవుతుంది. ఈ వివరాలను కేంద్ర ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేవకర్ వెల్లడించారు.
రామాయణ్ సీరియల్ ను రామానంద సాగర్ నిర్మించారు. ఈ సీరియల్ లో రాముడిగా అరుణ్ గోవిల్, సీతగా దీపికా చికిలియా, లక్ష్మణుడిగా సునిల్ లాహ్రి నటించారు.