Prabhas: ఆ ప్రశ్న నన్ను కాదు.. మా దర్శకుడిని అడగండి: పూజ హెగ్డే

Ask That question our director says Pooja Hegde
‘సాహో’ చిత్రం తర్వాత కొంత విరామం తీసుకున్న ప్రభాస్ ఇప్పుడు ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. పీరియాడిక్ లవ్‌స్టోరీగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇందులో ప్రభాస్‌ సరసన హీరోయిన్‌గా పూజ హెగ్డే నటిస్తోంది.

ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ కోసం అభిమానులు చాలా రోజులుగా ఎదురు చూస్తున్నారు. ఇదే విషయాన్ని ఓ అభిమాని పూజ హెగ్డేను అడిగాడు. ఫస్ట్‌లుక్ ఎప్పుడు వస్తుందో చెప్పాలని కోరాడు. అయితే, ఈ ప్రశ్న తనను కాదు, డైరెక్టర్ రాధాకృష్ణను అడగండి అంటూ పూజ తెలివిగా సమాధానం ఇచ్చి తప్పించుకుంది. అయితే, రాధాకృష్ణ కూడా ఫస్ట్ లుక్‌పై స్పష్టత ఇవ్వడం లేదు. ఆ విషయం ప్రభాస్‌, చిత్ర నిర్మాణ సంస్థలకే తెలియాలంటున్నాడు.

కరోనా నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది. జార్జియాలో ఓ షెడ్యూల్ షూటింగ్‌ను ముగించుకున్న చిత్ర బృందం స్వదేశానికి వచ్చింది. ప్రభుత్వ నిబంధనల మేరకు ప్రభాస్, పూజ హెగ్డేతో పాటు యూనిట్ మొత్తం ప్రస్తుతం స్వీయ నిర్బంధంలో ఉంది.
Prabhas
Tollywood
new movie
Pooja Hegde

More Telugu News