Hyderabad: తుపాకితో భార్య, బావమరిదిని బెదిరించిన వ్యాపారి.. కేసు నమోదు

Business man threatened his wife with Gun
  • హైదరాబాద్ బంజారాహిల్స్‌లో ఘటన
  • విభేదాల కారణంగా దూరంగా ఉంటున్న భార్యాభర్తలు 
  • కుమారుడు తుపాకి లాక్కోవడంతో తప్పిన ప్రమాదం
విభేదాల కారణంగా భర్త నుంచి దూరంగా ఉంటూ తల్లిదండ్రులతో కలిసి జీవిస్తున్న మహిళను తుపాకితో బెదిరించాడో భర్త. చంపేస్తానని వీరంగమేశాడు. అప్రమత్తమైన ఆయన కుమారుడు తుపాకి లాక్కోవడంతో పెను ప్రమాదం తప్పింది. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో జరిగిందీ ఘటన.

పోలీసుల కథనం ప్రకారం..  అమిత్ సంఘీ (42), రీటాసింగ్ భార్యాభర్తలు. బంజారాహిల్స్ రోడ్డు నంబరు 12లో నివసించే వీరికి 16 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. విభేదాల కారణంగా ఇద్దరూ వేర్వేరుగా ఉంటున్నారు. రీటాసింగ్ రోడ్డు నంబరు 10లో ఉంటున్న తన తల్లిదండ్రులతో కలిసి జీవిస్తోంది. రెండు రోజుల క్రితం మద్యం మత్తులో అత్తగారింటికి వచ్చిన సంఘీ.. భార్య, బావమరిదిపైకి తుపాకి ఎక్కుపెట్టి చంపేస్తానని బెదిరించాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న కుమారుడు అతడి చేతుల్లోంచి తుపాకి లాక్కోవడంతో ముప్పు తప్పింది. రీటాసింగ్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Hyderabad
Banjarahills
gun shooting
Police

More Telugu News