SaiTej: ‘కరోనా’ కట్టడికి.. మరో యువ హీరో సాయితేజ్ విరాళం

Cine Hero Sai Tej announces his donation to control corona
  • ‘మెగా’ కుటుంబం నుంచి మరో విరాళం
  • ఏపీ, తెలంగాణలకు రూ.10 లక్షలు ప్రకటించిన సాయి తేజ్
  • ‘కరోనా’ను కట్టడి చేయగలిగేది ‘ఓన్లీ ఐ అండ్ యూ’ అంటూ స్లోగన్
కరోనా వైరస్ పై పోరాటానికి ఇప్పటికే టాలీవుడ్ ప్రముఖ హీరోలు తమ విరాళాలు ప్రకటించారు. తాజాగా, ‘మెగా’ కుటుంబం నుంచి మరో యువ హీరో సాయి తేజ్ తన వంతు సాయం ప్రకటించారు. రెండు తెలుగు రాష్ట్రాలు తెలంగాణ, ఏపీలకు కలిపి రూ.10 లక్షలు విరాళంగా ప్రకటిస్తున్నట్టు సాయి తేజ్ పేర్కొన్నాడు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశాడు. ‘కరోనా’ను ఒకరి నుంచి మరొకరికి వ్యాపించకుండా చేయగలిగేది ‘ఓన్లీ ఐ అండ్ యూ’ అంటూ స్లోగన్ ఇచ్చిన సాయి తేజ్, ‘స్టే హోమ్, స్టే సేఫ్’ అని సూచించారు.
SaiTej
Hero
Tollywood
donation
Corona Virus

More Telugu News