Renu Desai: ఇది పచ్చి అబద్ధం.. ఈ సమయంలోనూ నాపై రూమర్లు ప్రచారం చేస్తున్నారు: రేణూ దేశాయ్

Renu Desais reaction on Lawyer Saab movie starrer Pawan Kalyan
  • వకీల్‌ సాబ్‌ సినిమాలో నేను నటించట్లేదు
  • ఎవరో రూమర్లు స్టార్ట్‌ చేస్తారు
  • వారి తీరుని చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోంది 
పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్ నటిస్తోన్న వకీల్‌ సాబ్‌ సినిమాలో తాను నటిస్తున్నానంటూ వస్తోన్న వార్తలను రేణూ దేశాయ్ ఖండించింది. 'ఇది పచ్చి అబద్ధం. ఎవరో రూమర్లు స్టార్ట్‌ చేస్తారు.. అసలు రూమర్లు స్టార్ట్‌ చేసే ఇంత సమయం వారికి ఎలా ఉంటుంది. ఇటువంటి వారి తీరుని చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోంది' అని తెలిపారు.

తాను ఆ సినిమాలో నటించడం లేదని స్పష్టం చేశారు. కరోనా విజృంభిస్తోన్న నేపథ్యంలోనూ రూమర్లు రావడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేసింది. కాగా, కరోనా విజృంభిస్తోన్న నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని, ఇంట్లో పెద్ద వారిని బాగా చూసుకోవాలని రేణూ దేశాయ్ సూచించింది. తన కూతురు ఆధ్యా స్కేటింగ్‌, పెయింటింగ్‌, డ్రాయింగ్‌, శాండ్‌విచ్‌ కుకింగ్‌ బాగా చేస్తుందని ఆమె తెలిపింది.
Renu Desai
Pawan Kalyan
Tollywood

More Telugu News