Kesineni Nani: విద్యార్థులు రోడ్డున పడ్డారు.. ఆదుకోండి: సీఎం జగన్‌ను కోరిన ఎంపీ కేశినేని నాని

kesineni nani on corona
  • హాస్టళ్లు బంద్‌ చేస్తున్నారు
  • విద్యార్థులు పోలీసులను ఆశ్రయిస్తున్నారు
  • సరైన ఆదేశాలు జారీ చేయండి
  • విద్యార్థులకు అన్ని సదుపాయాలూ ఉండేలా చర్యలు తీసుకోవాలి 
రాజమహేంద్రవరంలో వివిధ జిల్లాలకు చెందిన విద్యార్థులు రోడ్డున పడ్డారని.. స్టడీ సెంటర్లు, కోచింగ్‌ సెంటర్లు మూసివేయడంతో ఆందోళన చెందుతున్నారని వచ్చిన వార్తలను పోస్ట్ చేసిన టీడీపీ ఎంపీ కేశినేని నాని.. విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. హాస్టల్స్‌ను కూడా ఖాళీ చేయమనడంతో విద్యార్థులు ఆవేదన చెందుతున్నారని, దీంతో పోలీసులను, సబ్‌ కలెక్టర్‌ను శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంకు చెందిన విద్యార్థులు ఆశ్రయిస్తున్నారని ఆయన ట్విట్టర్‌ ద్వారా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. 'సరైన ఆదేశాలు జారీ చేసి విద్యార్థులను ఆదుకోండి.. వారికి అన్ని సదుపాయాలూ ఉండేలాగా చర్యలు తీసుకోవాలి' అంటూ ఏపీ ముఖ్యమంత్రి జగన్‌కు కేశినేని నాని ట్వీట్ చేశారు.
Kesineni Nani
Telugudesam
Jagan

More Telugu News