Hyderabad: హాస్టల్ విద్యార్థులకు షాక్.. పోలీసులు ఇచ్చిన అనుమతి పత్రాలు చెల్లవన్న డీజీపీ

  • విద్యార్థులను ఖాళీ చేయమన్న హాస్టల్ నిర్వాహకులు
  • ఇంటికి వెళ్లేందుకు అనుమతి పత్రాలు జారీ చేసిన పోలీసులు
  •  హాస్టళ్లు మూసివేయొద్దన్న డీజీపీ
Telangana DGP shocks Hostlers

అమీర్‌పేట, పంజాగుట్టలోని హాస్టళ్లలో ఉంటున్న యువతీయువకులకు తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి షాకిచ్చారు. హాస్టళ్లను ఖాళీ చేయాలంటూ నిర్వాహకులు ఒత్తిడి తీసుకురావడంతో తాము ఇప్పటికిప్పుడు ఎక్కడికి వెళ్లాలంటూ పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఆందోళనకు దిగారు. దీంతో వారు ఇళ్లకు వెళ్లేందుకు పోలీసులు అనుమతి ఇవ్వడంతో ఆందోళన సద్దుమణిగింది. అయితే, తాజాగా డీజీపీ ప్రకటన వారిని మరోమారు ఆందోళనలోకి నెట్టేసింది.

హాస్టలర్లు తమ స్వగ్రామాలకు వెళ్లేందుకు ఇప్పటి వరకు పోలీసులు ఇచ్చిన అనుమతి పత్రాలేవీ చెల్లవని డీజీపీ స్పష్టం చేశారు. లాక్‌డౌన్ నేపథ్యంలో విద్యార్థులను ఖాళీ చేయించొద్దని, పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులు వెళ్లి హాస్టల్ నిర్వాహకులతో మాట్లాడాలని ఆదేశించారు. కాగా, పోలీసులు ఇప్పటికే వందలాదిమందికి అనుమతి పత్రాలు ఇవ్వడంతో సొంతూళ్లకు బయలుదేరిన విద్యార్థులు కొందరు ఏపీ సరిహద్దులో నానా అవస్థలు పడుతున్నారు.

More Telugu News