KTR: 'మా అంకుల్ చనిపోయాడు.. అంబులెన్స్ కావాలి కేటీఆర్‌ సర్‌' అంటూ యువకుడి రిక్వెస్ట్.. మంత్రి రిప్లై!

ktr about corona
  • గాంధీ ఆసుపత్రిలో మార్చురీలో మృతదేహం
  • కేరళలోని కొచ్చిన్‌లో ఇల్లు
  • సాయం చేస్తామన్న కేటీఆర్‌
కరోనా విజృంభణ నేపథ్యంలో లాక్‌డౌన్‌ విధించడంతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాయం కావాలంటూ చాలా మంది తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు ట్వీట్లు చేస్తున్నారు.

'డియర్‌ సర్‌.. నిన్న మా అంకుల్‌ చనిపోయాడు. గాంధీ ఆసుపత్రిలో మార్చురీలో ఆయన మృతదేహం ఉంది. కేరళలోని కొచ్చిన్‌లో ఆయన ఇల్లు, కుటుంబం ఉంది. కేరళకు ఆ మృతదేహాన్ని అంబులెన్సులో కేరళకు తీసుకెళ్లడానికి మీరు సాయం చేయగలరా? ఎవరిని సంప్రదించాలి?' అని ఓ వ్యక్తి ప్రశ్నించాడు.

దీనిపై స్పందించిన కేటీఆర్‌.. 'తప్పకుండా సర్.. మీకు నా సానుభూతి తెలుపుతున్నాను' అని చెప్పారు. వారికి సాయం చేయాలని కేటీఆర్‌ ఆఫీస్‌ సిబ్బందికి సూచించారు.  

'నా కాలికి సర్జరీ చేయించుకోవడానికి ఈ నెల 28న మహబూబ్‌ నగర్‌ నుంచి హైదరాబాద్‌కు రావాల్సి ఉందని నేను రావచ్చా కేటీఆర్‌ సర్?' అని ఓ యువకుడు అడిగాడు. రావచ్చని చెప్పిన కేటీఆర్‌.. తన కార్యాలయ సిబ్బంది ఇందు కోసం సాయం చేస్తారని చెప్పారు.
KTR
Telangana
Corona Virus

More Telugu News