KCR: 'ఇప్పుడు క్వారంటైనే మన వాలంటైన్' అన్న కవితను ఉదాహరించిన సీఎం కేసీఆర్

CM KCR applauds poetry on corona outbreak
  • ఐనంపూడి శ్రీలక్ష్మి కవితను ప్రస్తావించిన తెలంగాణ సీఎం
  • కరోనాపై సానుకూల దృక్పథంతో కవితలు రాయాలంటూ కేసీఆర్ పిలుపు
  • కరోనాపై కవిసమ్మేళనాలను మీడియా ప్రోత్సహించాలని విజ్ఞప్తి
తెలంగాణలో కరోనా ఉద్ధృతి పెరుగుతున్న నేపథ్యంలో కవులు సానుకూల దృక్పథంతో కవితలు రాయాలని, ప్రజల్లో ధైర్యం పెంపొందేలా రచనలు చేయాలని సూచించారు. ఓ కవితను ఈ సందర్భంగా చదివి వినిపించారు. 'ఇప్పుడు క్వారంటైనే మన వాలంటైన్' అనుకోవాలంటూ ఐనంపూడి శ్రీలక్ష్మి రాసిన కవిత అద్భుతంగా ఉందని, ఆ కవితలో గొప్పభావం ఉందని ప్రశంసించారు. ఒంటరిగా ఉంటూనే సమష్టిగా యుద్ధం చేయాలని ఉద్బోధించారని కితాబిచ్చారు. కరోనాపై పోరాటంలో భాగంగా మీడియా సంస్థలు కూడా కవి సమ్మేళనాలు నిర్వహించాలని తెలిపారు.
KCR
Quarantine Centre
Valentine
Ayinampudi Srilakshmi
Corona Virus
Lockdown

More Telugu News