Kinjarapu Ram Mohan Naidu: కరోనా నిర్మూలనకు రూ.70 లక్షలు కేటాయించిన ఎంపీ రామ్మోహన్ నాయుడు

TDP MP Ram Mohan Naidu announces seventy lakhs to corona eradication
  • ఎంపీ లాడ్స్ నిధుల నుంచి వెచ్చించాలని నిర్ణయం
  • శ్రీకాకుళంలో కరోనాపై పోరుకు నెలజీతం విరాళంగా ఇస్తానన్న ఎంపీ
  • కూలీలకు ప్రత్యేక ఆర్థికనిధి కోసం ప్రధానికి లేఖ రాస్తానని వెల్లడి
టీడీపీ యువ ఎంపీ కె.రామ్మోహన్ నాయుడు కరోనా నిర్మూలన కోసం కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనాపై పోరాటానికి భారీగా నిధులు వెచ్చించాలని భావిస్తున్నారు. అందుకే తన ఎంపీ లాడ్స్ నిధుల నుంచి కరోనా నిర్మూలన కోసం రూ.70 లక్షలు కేటాయించనున్నారు.

అంతేకాకుండా, శ్రీకాకుళంలో కరోనా నియంత్రణకు నెల జీతం విరాళంగా ఇస్తానని రామ్మోహన్ నాయుడు ప్రకటించారు. లాక్ డౌన్ నేపథ్యంలో, కూలీలకు ప్రత్యేక ఆర్థికనిధి కేటాయించాలని ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాస్తానని వెల్లడించారు. చిరు వ్యాపారులను కూడా ఆదుకోవాలని ప్రధానికి విజ్ఞప్తి చేస్తానని తెలిపారు.
Kinjarapu Ram Mohan Naidu
Corona Virus
MP Lads
Andhra Pradesh
Srikakulam District
COVID-19
Narendra Modi

More Telugu News