Kesineni Nani: ఇవాళ అన్న క్యాంటీన్లు ఉంటే పేదలకు ఈ దుస్థితి వచ్చేది కాదు: కేశినేని నాని

  • కరోనా నేపథ్యంలో విజయవాడలో లాక్ డౌన్
  • ఆహార ప్యాకెట్లు తీసుకువచ్చి పంచుతున్న విజయవాడ కార్పొరేషన్
  • ముందు వెనుక ఆలోచించకుండా అన్న క్యాంటీన్లు మూసేశారన్న నాని
Kesineni Nani criticizing on Anna Canteens stoppage

కరోనా నేపథ్యంలో సకలం నిలిచిపోయిన సంగతి తెలిసిందే. విజయవాడలోనూ లాక్ డౌన్ నడుస్తోంది. దీనిపై టీడీపీ ఎంపీ కేశినేని నాని స్పందించారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కు చెందిన ఓ వాహనంలో ఆహార ప్యాకెట్లను తీసుకువచ్చి రోడ్డుపై ఉన్నవారికి పంచుతున్న వీడియోను పోస్టు చేసిన ఆయన.... ఇవాళ అన్న క్యాంటీన్లు ఉండి ఉంటే పేదలకు ఈ దుస్థితి వచ్చుండేది కాదని అభిప్రాయపడ్డారు. ముందు వెనుక ఆలోచించకుండా అన్న క్యాంటీన్లు మూసివేశారని, లేకుంటే పేదల ఆత్మగౌరవానికి భంగం కలగకుండా నాణ్యమైన భోజనం లభించేదని అభిప్రాయపడ్డారు. పాలకులు ఓ పని చేసే ముందు దాని వల్ల వచ్చే పరిణామాలను వందసార్లు భేరీజు వేసుకోవాలని నాని హితవు పలికారు.

More Telugu News