ఆగష్టు నుంచి 'ఎఫ్ 3' రెగ్యులర్ షూటింగ్

24-03-2020 Tue 16:15
  • 'ఎఫ్ 2'తో దక్కిన విజయం 
  • సీక్వెల్ కి జరుగుతున్న సన్నాహాలు 
  • కథానాయికల విషయంలో రానున్న స్పష్టత 
F3 Movie

'దిల్' రాజు నిర్మాణంలో .. అనిల్ రావిపూడి దర్శకత్వంలో కొంతకాలం క్రితం వచ్చిన 'ఎఫ్ 2' భారీ విజయాన్ని దక్కించుకుంది. వెంకటేశ్ - వరుణ్ - రాజేంద్ర ప్రసాద్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, అత్యధిక వసూళ్లను రాబట్టింది. దాంతో ఆ సినిమా సీక్వెల్ కి 'దిల్' రాజు శ్రీకారం చుట్టాడు.

ప్రస్తుతం అనిల్ రావిపూడి ఆ సీక్వెల్ కి సంబంధించిన స్క్రిప్ట్ పై కసరత్తు చేస్తున్నాడు. అయితే ఆగస్టులో రెగ్యులర్ షూటింగ్ మొదలు కావాలని అనిల్ రావిపూడితో 'దిల్' రాజు చెప్పాడట. ఆ దిశగా తన పనులను అనిల్ రావిపూడి వేగవంతం చేసినట్టుగా చెబుతున్నారు. వెంకటేశ్ - వరుణ్ తేజ్ లు ఈ సీక్వెల్ లో ఉండటం ఖాయమైపోయింది. కథానాయికల విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. కథానాయికలు ఎవరనే విషయంలో త్వరలోనే స్పష్టత రానుందని అంటున్నారు.