Corona Virus: తెలంగాణలో మరో మూడు కరోనా పాజిటివ్ కేసులు

coronavirus cases in telangana
  • 36కి చేరిన కరోనా కేసులు
  • జర్మనీ నుంచి వచ్చిన మహిళకు కరోనా 
  • సౌదీ నుంచి బేగంపేటకు వచ్చిన మరో మహిళకు పాజిటివ్
తెలంగాణలో మరో మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 36కి చేరింది. జర్మనీ నుంచి వచ్చిన హైదరాబాద్‌లోని చందానగర్‌కు చెందిన మహిళకు కరోనా నిర్ధారణ అయింది. సౌదీ అరేబియా నుంచి బేగంపేటకు వచ్చిన మరో మహిళకు కరోనా ఉన్నట్లు తేలింది. అలాగే లండన్‌ నుంచి వచ్చిన కూకట్‌పల్లి వాసికి కూడా కరోనా నిర్ధారణ అయింది.

 కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు కొనసాగుతున్నాయి. కరీంనగర్‌లో ఇండోనేషియా వాసులు పర్యటించిన ప్రాంతాల్లో పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు.

కరీంనగర్‌కు వచ్చే రహదారుల్లో ఐదు చోట్ల చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. ఇండోనేషియన్లు పర్యటించిన ప్రాంతాన్ని ప్రమాదకర జోన్‌గా ప్రకటించారు. ఆ జోన్‌లోకి ఎవ్వరూ వెళ్లకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. విదేశీయులతో పాటు వారితో సన్నిహితంగా ఉన్న 51 మందిని ఐసోలేషన్‌కు తరలించారు. రాష్ట్రంలోని ఉన్నతాధికారులతో కాసేపట్లో సీఎం కేసీఆర్‌ భేటీ ప్రారంభం కానుంది. ప్రగతి భవన్‌కు పలువురు అధికారులు చేరుకున్నారు.
Corona Virus
Telangana
KCR

More Telugu News