Sudheer Babu: నన్ను ఒప్పించడం కొంచెం కష్టమే: హీరో సుధీర్ బాబు

Sudheer Babu says its difficult to convince him
  • కథాకథనాలపై శ్రద్ధ పెడతాను 
  • బడ్జెట్ ను దృష్టిలో పెట్టుకుంటాను 
  • డబ్బు కోసం సినిమాలు చేయనన్న సుధీర్ బాబు
తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో సుధీర్ బాబు మాట్లాడుతూ, తన కెరియర్ గురించిన విశేషాలను పంచుకున్నాడు. కొత్త ప్రాజెక్టుల విషయంలో నన్ను ఒప్పించడం చాలా కష్టమనే టాక్ ఇండస్ట్రీలో వుంది. నిజమే .. ప్రతి ప్రాజెక్టు విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తాను. కథ నచ్చిన తరువాత, చెప్పినట్టుగా తీయగలడా? లేడా? అనేది చూస్తాను.

ఆ దర్శకుడు చెప్పిన కథను, అనుకున్న బడ్జెట్ లో పూర్తి చేయగలడా? లేడా? అనేది కూడా చూస్తాను. కథాకథనాలకి సంబంధించి సలహాలు .. సూచనలు ఇస్తే వింటాడా లేదా? ఎవరు చెప్పినా వినిపించుకోకుండా తనకి తోచినది చేసుకుంటూ వెళ్లిపోతాడా? అనేది కూడా చూస్తాను. ఏదో ఒక ప్రాజెక్టు వచ్చింది కదా అనీ, డబ్బులు వస్తాయి గదా అని సినిమాలు ఒప్పుకోను. ఒక సినిమాపై పెట్టే దృష్టే ఆ తరువాత సినిమా ఉండేలా  చేస్తుంది" అని చెప్పుకొచ్చాడు.
Sudheer Babu
Ali
Tollywood

More Telugu News