Sonia Gandhi: కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలకు సోనియా గాంధీ లేఖలు

sonia gandhi on corona
  • కరోనా విజృంభణ నేపథ్యంలో  లేఖలు
  •  కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు చర్యలు చేపట్టాలి
  • నిత్యావసరాల కొరత లేకుండా చూడాలి 
కరోనా విజృంభణ నేపథ్యంలో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ లేఖలు రాశారు. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు చర్యలు చేపట్టాలని అన్నారు. అదే సమయంలో ప్రజలకు నిత్యావసరాల కొరత లేకుండా చూడాలని చెప్పారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో వాటిని పరిష్కరించేందుకు అన్ని చర్యలూ తీసుకోవాలని ఆమె కోరారు. భారత్‌లో కరోనా వైరస్‌ కేసులు క్రమంగా పెరుగుతోన్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ కార్యాలయాల్లోనూ జనాలు గుమికూడకుండా చర్యలు తీసుకుంటున్నారు.
Sonia Gandhi
Congress
Corona Virus

More Telugu News