ఆంధప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షలు వాయిదా

AP Govt postpones10th class exams
  • ప్రకటించిన విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్
  • 31వ తేదీన మొదలవ్వాల్సిన పరీక్షలు
  • కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం
ఆంధప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షలు వాయిదా వేశారు. ఈ నెల 31వ తేదీ నుంచి పరీక్షలు జరగాల్సి ఉంది. అయితే, కరోనా వ్యాప్తి నేపథ్యంలో పరీక్షలను ఇప్పుడు నిర్వహించకపోవడమే మంచిదని ప్రభుత్వం నిర్ణయించింది. పరీక్షలను రెండు వారాలపాటు వాయిదా వేయనున్నట్టు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ప్రకటించారు. ఈ నెల 31 తర్వాత పరిస్థితులను సమీక్షించిన తర్వాత కొత్త తేదీలను ప్రకటిస్తామని తెలిపారు.

కరోనా కట్టడిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి ఈ రోజు ఉదయం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. అనంతరం పరీక్షలు వాయిదా వేస్తున్నట్టు విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. కరోనా వ్యాప్తిని అరికట్టే చర్యల్లో భాగంగా ప్రస్తుతం రాష్ట్రంలో లాక్‌డౌన్‌ ప్రకటించారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా ఏడుగురు కరోనా బారిన పడ్డారు.
Go Back to Shorts
Andhra Pradesh
10TH Exams
post pone
govt

More Telugu News