Nani: 'వి' సినిమా కోసం మొదట్లో పవన్, మహేశ్ బాబులను అనుకున్నారు: హీరో సుధీర్ బాబు

V Movie
  • ఇంద్రగంటితో 'సమ్మోహనం' చేశాను 
  • ఆ సమయంలోనే 'వి' కథ చెప్పారు 
  • తను ఇష్టపడిన పాత్ర తనని వెదుక్కుంటూ వచ్చిందన్న సుధీర్ బాబు
సుధీర్ బాబు తాజా చిత్రంగా రూపొందిన 'వి' త్వరలో ప్రేక్షకుల ముందుకురానుంది. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాను గురించి, 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో సుధీర్ బాబు ప్రస్తావించాడు. "నేను ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో 'సమ్మోహనం'  సినిమా చేస్తున్నప్పుడు, ఆయన నాకు 'వి' కథ చెప్పారు. కథ చాలా కొత్తగా .. విభిన్నంగా అనిపించింది.

'ఎవరితో చేయాలనుకుంటున్నారు?' అని  అడిగితే, పవన్ - మహేశ్ బాబులతో చేయాలనుకుంటున్నట్టు చెప్పారు. నాతో చేస్తే బాగుండునని అప్పుడే అనుకున్నాను. ఆ తరువాత కథానాయకుడిగా నానీని అనుకుంటున్నట్టు తెలిసింది. రెండవ కథానాయకుడి పాత్ర నా దగ్గరికి వచ్చింది. నేను బలంగా కోరుకున్నాను కనుకనే, ఆ కథ నా దగ్గరికి వచ్చింది. ఈ సినిమా నాకు తప్పకుండా మంచి పేరు తెచ్చిపెడుతుందనే నమ్మకం వుంది" అని చెప్పాడు.
Nani
Sudheer Babu
Indraganti

More Telugu News