Narendra Modi: జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్న మోదీ.. లాక్ డౌన్ కొనసాగింపుపై కీలక ప్రకటన చేసే అవకాశం!
- సాయంత్రం 6 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్న మోదీ
- గత గురువారం నుంచి మోదీ ప్రసంగిస్తుండటం ఇది రెండో సారి
- తొలి ప్రసంగంలో జనతా కర్ఫ్యూ గురించి ప్రకటన చేసిన ప్రధాని
ఈరోజు సాయంత్రం 8 గంటలకు ప్రధాని మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. కరోనా వైరస్ ప్రభావం గురించి దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడతానని ఆయన ట్వీట్ చేశారు. మన దేశంలో కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో జాతిని ఉద్దేశించి ప్రధాని ప్రసంగించనుండటం ఇది రెండో సారి.
గత గురువారం మోదీ ప్రసంగిస్తూ కరోనా నేపథ్యంలో ప్రజలు ఎలాంటి జాగ్రత్తలను తీసుకోవాలో వివరించారు. కరోనా విస్తరణను కట్టడి చేయడానికి జనతా కర్ఫ్యూని విధిస్తున్నట్టు ప్రకటించారు. ఈరోజు కూడా ప్రధాని కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. మరో రెండు వారాల పాటు లాక్ డౌన్ కొనసాగించనున్నట్టు ప్రకటించే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.