Home Quarentine: చేతిపై క్వారంటైన్ స్టాంప్.. బాయ్ ఫ్రెండ్ తో చిందులు... యువతిని పోలీసులకు అప్పగించిన స్థానికులు!

  • సింగపూర్ నుంచి హైదరాబాద్ కు వచ్చిన యువతి
  • స్వగ్రామానికి వెళ్లాలంటూ చేతిపై హోమ్ క్వారంటైన్ స్టాంప్
  • ఇంటికెళ్లకుండా హైదరాబాద్ లోనే మకాం
  • అరెస్ట్ చేసి క్వారంటైన్ సెంటర్ కు తీసుకెళ్లిన పోలీసులు
Lady party with a Home quarentine Stamp on hand

వివిధ దేశాల నుంచి వచ్చిన వారి నిర్లక్ష్యం వల్లే కరోనా కేసుల సంఖ్య తెలంగాణలో పెరుగుతోందనడానికి ఇది మరో నిదర్శనం. నిజామాబాద్ ప్రాంతానికి చెందిన ఓ యువతి, సింగపూర్ లో స్థిరపడి, నాలుగు రోజుల క్రితం నగరానికి రాగా, కరోనా పరీక్షలు చేసి, చేతిపై స్టాంప్ వేసిన అధికారులు, 14 రోజులు హోమ్ క్వారంటైన్ లో ఉండాలని ఆదేశించి పంపారు. వివాహితురాలైన ఆమె, స్వస్థలానికి వెళ్లకుండా, ఓల్డ్ బోయిన్ పల్లి ప్రాంతంలోని ఓ అపార్టుమెంట్ లో ఉంటూ, హస్మత్ పేటకు చెందిన తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి మందు పార్టీ చేసుకుంటూ, చిందులు వేసింది.

దీన్ని గమనించిన అపార్ట్ మెంట్ వాసులు, నిన్న మధ్యాహ్నం ఆమెను పిలిపించి, నిలదీశారు. చేతికి ఉన్న క్వారంటైన్ స్టాంప్ చూసి, తీవ్ర ఆందోళన చెందారు. ఆమెను అక్కడే బంధించి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగ ప్రవేశం చేసిన పోలీసులు, యువతీ, యువకులను విచారించి, అతను భర్త కాదని తేల్చి, క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఇద్దరినీ ప్రభుత్వ క్వారంటైన్ సెంటర్ కు తరలించారు. ఆమె ఉన్న ఫ్లాట్ ఎవరిది? ఎవరెవరిని కలిసింది? అన్న విషయాలపై విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు.

More Telugu News