Corona Virus: ’కరోనా‘ కట్టడికి మహారాష్ట్ర ప్రభుత్వం మరో కఠిన నిర్ణయం!

  • మహారాష్ట్రలోని జిల్లాల సరిహద్దుల మూసివేత 
  • పూర్తిగా నిలిచిపోనున్న జిల్లాల మధ్య రాకపోకలు 
  • ఇప్పటికే రాష్ట్ర సరిహద్దులు మూసివేసిన ప్రభుత్వం
Maharastra government takes key decision

మహారాష్ట్రలో కరోనా వైరస్ బాధితుల సంఖ్య 89కి చేరడంతో ఈ వైరస్ వ్యాప్తి నిరోధక చర్యల నేపథ్యంలో ఉద్దవ్ ఠాక్రే ప్రభుత్వం మరో కఠిన నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే  రాష్ట్ర సరిహద్దులు మూసివేయగా, 144 సెక్షన్ అమలులో ఉంది. మహారాష్ట్ర సర్కార్ తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. మహారాష్ట్రలోని జిల్లాల సరిహద్దులు కూడా మూసివేస్తున్నట్టు ప్రకటించింది. దీంతో, జిల్లాల మధ్య రాకపోకలు కూడా పూర్తిగా నిలిచిపోనున్నాయి. నిత్యావసరాలు విక్రయించే దుకాణాలు, మందుల షాపులు మాత్రమే తెరిచి ఉంటాయని ప్రభుత్వం పేర్కొంది.

More Telugu News