Tirumala: ఖాళీగా ఉన్న తిరుమల వీధుల్లో చిరుతలు, ఎలుగుబంట్ల సంచారం

  • కరోనా ప్రభావంతో తిరుమల క్షేత్రం మూసివేత
  • నిర్మానుష్యంగా మారిన మాడవీధులు
  • రాత్రివేళల్లో క్రూరమృగాల సంచారం
Wild animals appears in Tirumala roads

కరోనా భయంతో తిరుమల పుణ్యక్షేత్రానికి భక్తుల రాకను నిలిపివేసిన సంగతి తెలిసిందే. దాంతో కొన్నిరోజులుగా తిరుమల క్షేత్రం బోసిపోయినట్టు కనిపిస్తోంది. నిత్యం భక్తజనసందోహంతో కోలాహలంగా ఉండే మాడవీధులు వెలవెలబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఖాళీగా ఉన్న తిరుమల వీధుల్లో క్రూరమృగాలు సంచరిస్తున్నాయి. రాత్రివేళల్లో కల్యాణవేదిక, నారాయణగిరి, ముల్లగుంట ప్రాంతాల్లో చిరుతపులులు, ఎలుగుబంట్లు సంచరిస్తున్నట్టు గుర్తించారు. జంతువుల సంచారంతో విజిలెన్స్ అధికారులు అప్రమత్తమయ్యారు. తిరుమల కొండపై ఉన్న స్థానికులు ఇళ్లకే పరిమితం కావాలని అధికారులు సూచించారు.

More Telugu News