Chandrababu: కరోనా నేపథ్యంలో సీఎం జగన్ కు చంద్రబాబు లేఖ

TDP Chief Chandrababu wrote AP CM Jagan
  • కరోనా కట్టడికి పటిష్టచర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి
  • రెండు నెలలకు సరిపడా రేషన్ ఇవ్వాలన్న చంద్రబాబు
  • ఒక్కో కుటుంబానికి రూ.5 వేలు ఇవ్వాలని సూచన
ఏపీలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు లేఖ రాశారు. కరోనా కట్టడికి పటిష్టచర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. లాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయేవారికి అండగా నిలవాలని కోరారు. రెండు నెలలకు సరిపడా రేషన్ ఇవ్వాలని తెలిపారు. అంతేకాకుండా, ప్రతి కుటుంబానికి రూ.5 వేల ఆర్థికసాయం అందించాలని సూచించారు. కూరగాయల ధరలు పెరగకుండా చూడాలని పేర్కొన్నారు.
Chandrababu
Jagan
Letter
Corona Virus
Andhra Pradesh
COVID-19

More Telugu News