Nagababu: ధైర్యంగా ఉండండి.. జాగ్రత్తలు పాటించండి: నటుడు నాగబాబు

Artist NagaBabu posted a video
  • జనతా కర్ఫ్యూను విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు
  • ‘కరోనా’ నివారణ కోసం పాటుపడుతున్న ప్రతి ఒక్కరికీ  కృతఙ్ఞతలు
  • ప్రజలకు ధైర్యం చెబుతూ ఓ వీడియో పోస్ట్ చేసిన నాగబాబు 
కరోనా వైరస్ మహమ్మారిని నివారించే చర్యల్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు యావత్తు  భారతదేశ ప్రజలు స్వచ్ఛందంగా నిన్న ‘జనతా కర్ఫ్యూ’ పాటించిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ప్రముఖ నటుడు నాగబాబు ఓ ట్వీట్ చేశారు. జనతా కర్ఫ్యూను విజయవంతం చేసినటువంటి ప్రతి భారతీయుడికి తన ధన్యవాదాలు తెలిపారు.

‘కరోనా’ నివారణ కోసం పాటుపడుతున్న.. ముఖ్యంగా, వైద్యులు, వైద్య సిబ్బందికి, పోలీసులు, అధికారులకు తన హృదయపూర్వక కృతఙ్ఞతలు తెలిపారు. జీవితం గురించి భయపడొద్దని, ఆందోళన చెందవద్దని ప్రజలకు నాగబాబు ధైర్యం చెప్పారు. ఓ బాధ్యత గల పౌరుడిగా ఓ వీడియోను షేర్ చేస్తున్నానని, దీని ద్వారా తన ఆలోచనలు పంచుకుంటున్నానని అన్నారు.
Nagababu
Artist
Corona Virus
precautions

More Telugu News