Nithin: కరోనా బాధితులకు అండ.. తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలకు హీరో నితిన్ విరాళం

Hero Nithin donates to Telangana and Andhra Pradesh governments
  • కరోనాపై సమరశంఖం పూరించిన తెలుగు రాష్ట్రాలు
  • తనవంతుగా స్పందించిన నితిన్
  • సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ.10 లక్షల చొప్పున విరాళం
అత్యంత ప్రమాదకర కరోనా వైరస్ తో పోరాడేందుకు ప్రభుత్వాలు కోట్లు కుమ్మరిస్తున్నాయి. ఈ క్రమంలో టాలీవుడ్ హీరో నితిన్ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు మొత్తం రూ.20 లక్షలు విరాళం ప్రకటించారు. తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ.10 లక్షలు, ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ.10 లక్షలు అందించాలని నిర్ణయించుకున్నారు. కరోనా వ్యాధిగ్రస్తులను గుర్తించడం, క్వారంటైన్, ఐసోలేషన్, చికిత్స... ఇలా అనేక రూపాల్లో ప్రభుత్వాలకు తడిసి మోపెడవుతోంది. ఇప్పుడు దాతలు అందించే ఏ కొద్ది సాయమైనా కరోనా రోగులకు ఉపయోగకరంగా ఉంటుంది.
Nithin
Telangana
Andhra Pradesh
Corona Virus
COVID-19

More Telugu News