Airlines: కరోనా ప్రభావంతో నిలిచిపోనున్న దేశీయ విమాన సర్వీసులు

Operations of domestic scheduled commercial airlines shall cease
  • దేశంలో విస్తృతమవుతున్న కరోనా వైరస్
  • మార్చి 24 అర్ధరాత్రి నుంచి దేశీయ రూట్లలో విమానాలు బంద్
  • రవాణా విమానాలకు మినహాయింపు
దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలు కరోనా నివారణ చర్యల్లో భాగంగా లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. రైళ్లు, బస్సులు నిలిచిపోయాయి. ప్రజా రవాణా వ్యవస్థ స్థంభించిపోయింది. ఇప్పటికే అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దు చేయగా, ఇప్పుడా జాబితాలో దేశీయ విమాన సర్వీసులు కూడా చేరాయి. దేశీయ విమానయాన సంస్థల కార్యకలాపాలను ఈ నెల 24 అర్ధరాత్రి నుంచి నిలిపివేయాలని నిశ్చయించారు. తద్వారా దేశీయ రూట్లలో తిరిగే ప్రయాణికుల విమానాలు నిలిచిపోనున్నాయి. అయితే, రవాణా విమానాలకు ఈ నిర్ణయం వర్తించదు.
Airlines
Domestic
Cease
Corona Virus
India
COVID-19

More Telugu News