Priyanka Chopra: ఇండియాలో లేకపోయినా.. ఆ స్ఫూర్తిలో నేనూ భాగస్వామినే: ప్రియాంకాచోప్రా

Priyanka Chopra Clapped Too All The Way From USA
  • అమెరికాలో ఉన్న ప్రియాంకాచోప్రా
  • భర్త నిక్ తో కలిసి సెల్ఫ్ క్వారంటైన్
  • చప్పట్లు కొట్టి సంఘీభావం ప్రకటించిన పీసీ
ప్రధాని మోదీ పిలుపు మేరకు యావత్  దేశ ప్రజలు నిన్న జనతా కర్ఫ్యూని విజయవంతం చేశారు. విదేశాల్లో ఉన్న భారతీయులు సైతం జనతా  కర్ఫ్యూకి సంఘీభావం ప్రకటించారు. బాలీవుడ్ నటి ప్రియాంకచోప్రా కూడా అమెరికాలో జనతా కర్ఫ్యూలో భాగస్వామి అయింది. తన భర్త నిక్ జొనాస్ తో కలిసి ఆమె ప్రస్తుతం సెల్ఫ్ క్వారంటైన్ లో ఉంది.

అయితే, నిన్న సాయంత్రం 5 గంటలకు చప్పట్టు కొడుతూ జనతా కర్ఫ్యూ స్ఫూర్తిలో పాలుపంచుకుంది. ఈ విషయాన్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా ప్రియాంక  తన అభిమానులతో పంచుకుంది. ప్రధాని మోదీ పిలుపు మేరకు ప్రపంచమంతా డాక్టర్లు, నర్సులు, వైద్య సిబ్బంది చేస్తున్న సేవలకు చప్పట్ల ద్వారా సంఘీభావం ప్రకటించారని... తాను ఇండియాలో లేకపోయినప్పటికీ, ఆ స్ఫూర్తిలో భాగస్వామిని అయ్యానని చెప్పింది.
Priyanka Chopra
Janata Curfew
USA
Bollywood

More Telugu News