Suneetha: కనిక కపూర్ వార్తలో తన ఫొటో వాడారంటూ కేటీఆర్ కు గాయని సునీత ఫిర్యాదు

Singer Suneetha complains to KTR
  • ఉత్తరాది గాయని కనిక కపూర్ కు కరోనా
  • కనిక వార్తలో సునీత ఫొటో
  • చర్యలు తీసుకోవాలన్న సునీత
ఉత్తరాది గాయని కనిక కపూర్ కరోనా బారినపడడం, ఆమె ఆ విషయాన్ని నిర్లక్ష్యం చేయడం తీవ్ర కలకలం సృష్టించింది. అయితే, ఓ ప్రముఖ గాయనికి కరోనా సోకిందంటూ సోషల్ మీడియాలో వచ్చిన వార్తలలో తన ఫొటో (థంబ్ నెయిల్ ఫొటో) వినియోగించారని గాయని సునీత మండిపడుతున్నారు.

అసందర్భోచితంగా తన ఫొటో ఉపయోగించారంటూ ఆమె మంత్రి కేటీఆర్ కు ఫిర్యాదు చేశారు. అటు డీజీపీ మహేందర్ రెడ్డికి కూడా ఆమె ఫిర్యాదు చేశారు. తన ఫొటో ఉండడంతో తనకు కరోనా సోకిందన్న అనుమానాలు తలెత్తేలా ఆ వార్త ఉందని ఆరోపించారు. బాధ్యుల పట్ల చర్యలు తీసుకోవాలని సునీత కోరారు.
Suneetha
kanika
Singer
Corona Virus

More Telugu News