Suresh Raina: మా అబ్బాయి రియో రైనాను స్వాగతిస్తున్నాం: సురేశ్ రైనా

 Suresh Raina says We proudly welcome our son Rio Raina
  • టీమిండియా క్రికెటర్ సురేశ్ రైనా దంపతులకు రెండో సంతానం
  • మగబిడ్డకు జన్మనిచ్చిన ప్రియాంక
  • రైనా దంపతులకు ఇప్పటికే నాలుగేళ్ల కూతురు 
టీమిండియా క్రికెటర్ సురేశ్ రైనా మరోమారు తండ్రి అయ్యాడు. రైనా, ప్రియాంకలకు ఈరోజు తెల్లవారుజామున పండంటి మగ బిడ్డ జన్మించాడు. ఈ విషయాన్ని తెలియజేస్తూ రైనా ఓ ట్వీట్ చేశాడు. తమ కొడుకు, గ్రేసియాకు సోదరుడు రియో రైనాను స్వాగతిస్తున్నందుకు తాము గర్విస్తున్నామని అన్నాడు. ఆ చిన్నారి బౌండరీల పరిధులు దాటి ఎదగాలని ఆకాంక్షించాడు.  కాగా, రైనా దంపతులకు ఇప్పటికే నాలుగు సంవత్సరాల పాప గ్రేసియా రైనా ఉంది. ఇప్పుడు అబ్బాయి కూడా పుట్టడంతో రైనా దంపతుల ఆనందానికి అవధులు లేవు.
Suresh Raina
Cricket
New baby boy
Rio Raina

More Telugu News