Mamata Banerjee: మా రాష్ట్రానికి అన్ని విమాన సర్వీసులను తక్షణమే ఆపేయండి: మోదీకి మమతా బెనర్జీ లేఖ

Mamata Banerjee appealed to PM Modi to stop all flights to West Bengal
  • దేశం లాక్ డౌన్ అయినా విమానాలు తిరుగుతున్నాయి
  • విమానాల్లో ప్రయాణికుల మధ్య దూరం ఉండదు
  • దీని వల్ల వైరస్ విస్తరించే అవకాశం ఉంది
తమ రాష్ట్రానికి వచ్చే అన్ని విమాన సర్వీసులను ఆపేయాలని కోరుతూ ప్రధాని మోదీకి పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ లేఖ రాశారు. దేశ వ్యాప్తంగా కరోనా కారణంగా దాదాపు 80 జిల్లాల్లో లాక్ డౌన్ అయిన తరుణంలో ఆమె తీవ్ర ఆందోళన వెలిబుచ్చారు.

దేశంలో కరోనా విస్తరిస్తోందని... ఈ  పరిస్థితుల్లో కూడా దేశంలో విమాన రాకపోకలు యథాతథంగా కొనసాగుతున్నాయని ఆమె విమర్శించారు. విమానాలు తిరిగితే షట్ డౌన్ కు అర్థం లేదని... క్వారంటైన్ విధానాలకు కూడా ఇది తూట్లు పొడుస్తుందని అన్నారు. విమానాల్లో ప్రయాణికుల మధ్య సామాజిక దూరం ఉండదని... పక్కపక్కనే కూర్చుని ప్రజలు ప్రయాణిస్తారని... దీని వల్ల  వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందని పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో తమ రాష్ట్రానికి వచ్చే అన్ని విమాన సర్వీసులను తక్షణమే రద్దు చేయాలని మోదీకి మమతా బెనర్జీ విన్నవించారు. అప్పుడే కరోనా మహమ్మారి విస్తరణకు తమ రాష్ట్రంలో అడ్డుకట్ట వేయగలమని... పశ్చిమబెంగల్ లాక్ డౌన్ ను పూర్తి  స్థాయిలో అమలు చేయగలుగుతామని చెప్పారు.
Mamata Banerjee
TMC
Narendra Modi
BJP
Lockdown
Flight services
Letter

More Telugu News