Kolkata: కోల్ కతాలో కరోనా రోగి మరణం... దేశంలో 9కి చేరిన మృతుల సంఖ్య

Corona positive man dies of corona in Kolkata as death toll raised to nine
  • దేశంలో కొనసాగుతున్న కరోనా తీవ్రత
  • కోల్ కతాలో 55 ఏళ్ల వ్యక్తికి కరోనా
  • చికిత్స పొందుతూ మృతి చెందినట్టు డాక్టర్ల వెల్లడి
భారత్ లో కరోనా భూతం వేగంగా వ్యాపిస్తోంది. ఈ ప్రాణాంతక వైరస్ పై పోరాటంలో భాగంగా దేశంలో 19 రాష్ట్రాలు లాక్ డౌన్ ప్రకటించాయి. తాజాగా, కోల్ కతాలో ఓ కరోనా పాజిటివ్ వ్యక్తి మరణించినట్టు తెలిసింది. ఈ 55 ఏళ్ల వ్యక్తి ఇటీవలే కరోనా లక్షణాలతో ఆసుపత్రిలో చేరగా, చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. తద్వారా దేశంలో కరోనా మృతుల సంఖ్య 9కి చేరింది. అటు యూరప్ దేశాలతో పోల్చితే భారత్ లో కరోనా మరణాల రేటు తక్కువే అయినా, వైరస్ వ్యాపిస్తున్న తీరు ప్రభుత్వాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. ప్రస్తుతం విధించిన లాక్ డౌన్ మరో వారం రోజుల తర్వాత ఫలితాన్నివ్వడం ప్రారంభిస్తుందని అంచనా వేస్తున్నారు. కొత్తగా ఎవరికీ కరోనా వైరస్ సోకకపోతే ప్రభుత్వ చర్యలు ఫలించినట్టే భావించాలి.
Kolkata
Corona Virus
Death
India
COVID-19

More Telugu News