manoj: ఇలాంటి వీడియో తీసి మీరూ పోస్ట్ చేయండి: ఆసక్తికర వీడియో పోస్ట్ చేసిన మంచు మనోజ్‌

manchu manoj posts his father video
  • కరోనా వైరస్ కారణంగా షూటింగులు బంద్‌
  • ఇంట్లో భార్యకు మోహన్‌ బాబు సేవలు
  • నిర్మలా దేవి సోఫాలో పడుకుని ఉండగా గాలి విసిరిన మోహన్ బాబు
  • భార్యకు సేవ చేసుకునే అవకాశం వచ్చిందన్న మనోజ్
కరోనా వైరస్ కారణంగా షూటింగులు బంద్‌ కావడంతో ఇంట్లోనే ఉంటోన్న సినీనటులు సామాజిక మాధ్యమాల్లో చురుకుగా పోస్టులు చేస్తున్నారు. టాలీవుడ్ నటుడు మోహన్‌ బాబు తన భార్య నిర్మలా దేవికి సపర్యలు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆయన కుమారుడు మంచు మనోజ్ షేర్ చేశాడు.

నిర్మలా దేవి సోఫాలో పడుకుని ఉండగా, ఆమెకు మోహన్ బాబు గాలి విసురుతున్నారు. ప్రతి ఒక్కరు తన తండ్రిలాగే భార్యకు సపర్యలు చేయాలని మనోజ్ అన్నాడు. ఇలాంటి క్వారంటైన్ మూమెంట్‌లను వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయాలని చెప్పాడు. భార్యకు సేవ చేసుకునే అవకాశం వచ్చిందని, సేవలు చేయించుకోవడానికి వారు అర్హులని పేర్కొన్నాడు.
manoj
Mohan Babu
Tollywood

More Telugu News