Croetia: క్రొయేషియాలో భూకంపం... భారీగా కూలిన భవనాలు!

Earthquake in Croatia
  • రాజధాని జాగ్రెబ్ లో భూకంపం
  • పలువురికి గాయాలు
  • ఇప్పటికే లాక్ డౌన్ లో ఉన్న జాగ్రెబ్
క్రొయేషియా రాజధాని జాగ్రెబ్ లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.3గా నమోదైంది. భూకంపం ధాటికి పలు భవనాలు కుప్పకూలినట్టు తెలుస్తోంది. పలువురికి గాయాలు కాగా, అధికారులు, సహాయక సిబ్బంది వారిని ఆసుపత్రులకు తరలిస్తున్నారు. ఇప్పటికే కరోనా కారణంగా జాగ్రెబ్ లో లాక్ డౌన్ ను ప్రకటించగా, తాజాగా వచ్చిన భూకంపంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. కాగా, భూకంపం కారణంగా జరిగిన ప్రాణనష్టంపై సమాచారం అందాల్సివుంది.
Croetia
Jagreb
Earth Quake

More Telugu News