Corona Virus: ఒకే ఇంట్లో ముగ్గురికి కరోనా... తెలంగాణలో 27కి పెరిగిన కేసులు!

Corona Toll Rises to 27 in Telangana
  • ఆదివారం నాడు ఆరు కొత్త కేసులు
  • లండన్ నుంచి వచ్చిన ముగ్గురు యువకులకు పాజిటివ్
  • బాధితులతో నిండిపోయిన గాంధీ, చెస్ట్ హాస్పిటల్స్
నిన్న ఆదివారం ఒక్కరోజే కొత్తగా ఆరు కేసులు నమోదు కావడంతో తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 27కు చేరింది. తాజాగా, ఒకే కుటుంబంలోని ముగ్గురికి వైరస్ సోకింది. నాలుగు రోజుల క్రితం దుబాయ్ నుంచి వచ్చిన ఓ వ్యాపారి వైరస్ బారిన పడగా, ఆతని కుమారుడికి, భార్యకు కూడా వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది.

వీరితో పాటు గుంటూరుకు చెందిన యువకుడు లండన్ నుంచి దుబాయ్ మీదుగా హైదరాబాద్ రాగా, అతనికి పాజిటివ్ వచ్చింది. లండన్ నుంచే దోహా మీదుగా వచ్చిన కూకట్ పల్లి ప్రాంత యువకుడికి కూడా వైరస్ సోకింది.

ఇక హైదరాబాద్ లోని గాంధీ, చెస్ట్ హాస్పిటల్స్ లో ఏర్పాటు చేసిన కోవిడ్ ప్రత్యేక వార్డులన్నీ నిండిపోవడంతో, కింగ్ కోటి ఆసుపత్రికి రోగులను తరలిస్తున్నారు. సమీప భవిష్యత్తులో కేసులు పెరిగే అవకాశం ఉన్నందున గచ్చిబౌలిలోని స్పోర్ట్స్ విలేజ్ ని ఇప్పటికే ఐసోలేషన్ కోసం సిద్ధం చేసిన అధికారులు, అవసరాన్ని బట్టి, దాన్ని పూర్తి స్థాయి ఆసుపత్రిగా మార్చాలని భావిస్తున్నారు.
Corona Virus
Telangana

More Telugu News