విదేశాల్లో ఉన్నవాళ్లు ఇంకా వస్తూనే ఉన్నారు... అప్రమత్తంగా ఉండాలి: కేంద్రం
- జనతా కర్ఫ్యూకు విశేష స్పందన వచ్చిందన్న కేంద్ర ఆరోగ్యశాఖ
- కరోనా వ్యాప్తి నివారణే మన కర్తవ్యం అంటూ ఉద్ఘాటన
- 75 జిల్లాల్లో లాక్ డౌన్ విధించాలని కోరినట్టు వెల్లడి
విదేశాల్లో ఉన్నవాళ్లు ఇంకా మనదేశానికి వస్తున్నారని, అందువల్ల కరోనా వ్యాప్తిపై మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని అన్నారు. విదేశాల నుంచి వచ్చేవాళ్లను మొదట ఐసోలేషన్ కు తరలిస్తున్నామని, అందరికీ వైద్య పరీక్షలు చేసి పరిశీలనలో ఉంచుతున్నామని చెప్పారు. అత్యవసర రవాణా సేవలే అందించాలని రాష్ట్రాలను కోరామని వెల్లడించారు.