Yanam: పర్యాటక సౌధం యానాం మూతపడింది : అన్ని రోడ్లు బంద్‌!

  • ద్రాక్షారామం రోడ్డును మాత్రమే తెరిచిన అధికారులు
  • ‘జనతా కర్ఫ్యూ’ ప్రభావం
  • కట్టుదిట్టమైన భద్రత, ఆరోగ్య సేవలు
tourist plaza yanam closed

తూర్పుతీరంలో పర్యాటక ప్రాంతంగా పేరొందిన కేంద్ర పాలిత ప్రాంతం యానం పూర్తిగా మూతపడింది. పాండిచ్చేరిలో భాగమైన యానాం పట్టణం తూర్పుగోదావరి జిల్లాను ఆనుకుని ఉంది. నిత్యం సందర్శకులతో రద్దీగా ఉండే ఈ ప్రాంతం ‘జనతా కర్ఫ్యూ’ ప్రభావంతో బోసిపోయింది.

యానాం పట్టణానికి చేరే అన్ని రోడ్లను పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా మూసివేశారు. ఒక్క ద్రాక్షారామం రోడ్డును మాత్రం తెరిచి అత్యవసర రాకపోకలకు అనుమతిస్తున్నారు. దీంతో పట్టణంతోపాటు పర్యాటక ప్రాంతాలన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. జనం కూడా ఇంట్లో నుంచి రాకపోవడంతో రోడ్లన్నీ బోసిపోయి కనిపిస్తున్నాయి. అన్ని రోడ్లలోనూ పోలీసులే కనిపిస్తున్నారు. కరోనా నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలతోపాటు వైద్య సేవలను సిద్ధం చేసి ఉంచారు.

More Telugu News