Salman Khan: ఇది పబ్లిక్‌ హాలీ డే కాదు భయ్యా: సల్మాన్ ఖాన్

Ye public holiday nahi hai bhaai Salman Khan
  • ఇది చాలా సీరియస్ విషయం
  • అన్నింటినీ బంద్‌ చేయండి
  • మాస్కులు ధరించండి.. 
  • ఇలా చేస్తే వందలాది మంది ప్రాణాలను కాపాడుకోవచ్చు
కరోనా విజృంభణ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ సూచనలు పాటించాలని ప్రజలను బాలీవుడ్ నటుడు సల్మాన్‌ ఖాన్‌ కోరాడు.  ప్రతి ఒక్కరు సెల్ఫ్ ఐసోలేషన్‌ పాటించాలని కోరుతూ ఆయన ఓ వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశాడు.

'ఇది పబ్లిక్‌ హాలీడే కాదు భయ్యా.. ఇది చాలా సీరియస్ విషయం. అన్నింటినీ బంద్‌ చేయండి.. మాస్కులు ధరించండి.. చేతులు కడుక్కోండి.. పరిశుభ్రంగా ఉండండి. ఇలా చేయడంలో సమస్య ఏముంటుంది. ఇలా చేస్తే వందలాది మంది ప్రాణాలను కాపాడుకోవచ్చు. వీటన్నింటినీ పాటించండి.. ఇది ప్రాణాలకు సంబంధించిన విషయం' అని అన్నాడు.

జనతా కర్ఫ్యూ నేపథ్యంలో బాలీవుడ్‌ నటులందరూ ఇంటికే పరిమితమై కుటుంబ సభ్యులతో గడుపుతున్నారు. ఇందులో పాల్గొనాలని తమ అభిమానులకు విజ్ఞప్తి చేస్తున్నారు.  

Salman Khan
Bollywood

More Telugu News