Nellore District: నెల్లూరు జిల్లాలో జనతా కర్ఫ్యూ కారణంగా పెళ్లి వాయిదా వేసుకున్న కుటుంబం

  • రేపు దేశవ్యాప్తంగా జనతా కర్ఫ్యూ
  • మర్రిపాడు మండలం నందవరంలో రేపు జరగాల్సిన పెళ్లి
  • కరోనా నివారణ చర్యల్లో భాగంగా సోమవారానికి వాయిదా
Family postpones wedding due to Janata Curfew

ఏపీలోనూ కరోనా మహమ్మారి ఉనికి చాటుకుంటోంది. ఇప్పటివరకు విదేశాల నుంచి వచ్చినవారికే కరోనా పాజిటివ్ గా వెల్లడవుతున్నా, మున్ముందు పరిస్థితి ఎలా ఉంటుందన్నది అంచనా వేయలేకపోతున్నారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు జనతా కర్ఫ్యూకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.

 ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో ఓ కుటుంబం పెళ్లిని వాయిదా వేసుకుని స్ఫూర్తిని చాటింది. ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపునకు సానుకూలంగా స్పందించిన ఆ కుటుంబం జీవితంలో అత్యంత ముఖ్య ఘట్టమైన వివాహ వేడుకను సైతం ప్రజాక్షేమం కోసం పక్కనబెట్టింది. మర్రిపాటు పండలం నందవరంలో ఈ పెళ్లి రేపు జరగాల్సి ఉండగా, కర్ఫ్యూ ప్రభావంతో సోమవారానికి వాయిదాపడింది. కరోనా నివారణ చర్యల్లో భాగంగానే పెళ్లిని వాయిదా వేసినట్టు ఆ కుటుంబం వెల్లడించింది.

More Telugu News