Nara Devansh: వీడే నా రియల్ లైఫ్ హీరో: నారా లోకేశ్

Lokesh wishes his son Devansh on Birthday
  • ఇవాళ నారా దేవాన్ష్ పుట్టినరోజు
  • తనయుడ్ని బెస్ట్ ఫ్రెండ్ గా అభివర్ణించి విషెస్ చెప్పిన లోకేశ్
  • జీవితం కంటే మిన్నగా ఇష్టపడతానంటూ ట్వీట్
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తనయుడు దేవాన్ష్ ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా తనయుడికి లోకేశ్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. "నా బెస్ట్ ఫ్రెండ్ కి హ్యాపీ బర్త్ డే విషెస్ చెబుతున్నాను. నాతో గిల్లికజ్జాలు పెట్టుకుంటూ, నాతో కలిసి అల్లరి చేస్తూ, కొంటె పనుల్లో భాగస్వామిగా ఉంటూ, నాతో కలిసి  పెద్ద పెద్ద పనులు చేసే నా రియల్ లైఫ్ హీరోకి జన్మదిన శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరితో నిస్వార్థంగా మెలిగే నా బిడ్డను నా జీవితం కన్నా మిన్నగా ఇష్టపడతాను. లవ్యూ దేవాన్ష్" అంటూ ట్వీట్ చేశారు.
Nara Devansh
Nara Lokesh
Birthday
Telugudesam
Andhra Pradesh

More Telugu News