Nidhi Agarwal: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం  

Nidhi Agarwal demands a bomb for item song
  • నిధి అగర్వాల్ భారీ డిమాండ్ 
  • రవితేజ సినిమాలో మాళవిక 
  • తెలుగులోకి మలయాళం సూపర్ హిట్
 *  తమిళంలో ప్రస్తుతం జయం రవి సరసన ఓ చిత్రంలో నటిస్తున్న కథానాయిక నిధి అగర్వాల్ మరో చిత్రంలో ఐటెం పాటకు భారీ పారితోషికాన్ని అడిగిందట. కోలీవుడ్ యంగ్ హీరో ఒకరు నటిస్తున్న చిత్రంలో ఐటెం సాంగు చేయడానికి ఏకంగా 60 లక్షలు డిమాండ్ చేసిందట. దాంతో సదరు దర్శక నిర్మాతలు అమ్మడికి ఓ నమస్కారం పెట్టి జారుకున్నారని ప్రచారం జరుగుతోంది.  
*  రవితేజ తన తదుపరి చిత్రాన్ని త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో చేస్తున్నాడు. ఇందులో నటించే హీరోయిన్లలో ఒకరిగా మాళవిక శర్మను ఎంపిక చేశారు. ఇక ఈ చిత్రం 80  దశకం నాటి వాతావరణంలో పగ, ప్రతీకారం నేపథ్యంలో సాగుతుందట.
*  మరో మలయాళం సినిమా తెలుగులోకి రీమేక్ కానుంది. పృథ్వీ రాజ్, బిజు మీనన్ ప్రధాన పాత్రలు పోషించిన 'అయ్యప్పనుమ్ కోషియం' సినిమా ఇటీవల మలయాళంలో సూపర్ హిట్ అయింది. చిన్న బడ్జెట్టులో నిర్మించిన ఈ చిత్రం అక్కడ సుమారు 30  కోట్లు వసూలు చేసింది. దీంతో తెలుగు నిర్మాత సూర్యదేవర నాగ వంశీ భారీ రేటుకి ఈ చిత్రం తెలుగు రీమేక్ హక్కులను సొంతం చేసుకున్నారు.
Nidhi Agarwal
Jayam Ravi
Raviteja
Malavika Sharma

More Telugu News